నాగార్జున “ఆఫీసర్” క్లోజింగ్ కలెక్షన్లు : బిగ్గెస్ట్ డిజాస్టర్ లకే అమ్మ మొగుడు

officer-final-collections

నాగార్జున ఆర్జివి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆఫీసర్. పాతికేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ డిజాస్టర్ లలో నెంబర్ 1 గా నిలుస్తుందని చెప్పొచ్చు. జూన్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా కనీసం ఖర్చుల వరకు కూడా వసూళ్లను చేయలేకపోయింది. మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో కోటి మాత్రమే కలెక్ట్ చేసింది.

తెలుగు రెండు రాష్ట్రాల్లో కలుపుకుని కేవలం 75 లక్షలు మాత్రమే ఆఫీసర్ వసూళు చేసింది. నాగార్జున క్రేజ్ ఆఫీసర్ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అంతేకాదు నాగార్జున కెరియర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఉన్న భాయ్, ఆకాశ వీధిలో, రక్షకుడు సినిమాలను వెనక్కి నెట్టేసి ఆఫీసర్ ముందు నిలిచింది.

కంటేంట్ లేని సినిమా వస్తే అందులో స్టార్ హీరో ఉన్నా ఇలాంటి భయంకరమైన ఫలితాలను అందుకుంటారని మరోసారి ప్రూవ్ చేసింది ఆఫీసర్. సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు కాకున్నా మేజర్ సిటీస్ లో ఆఫీసర్ సినిమా తొలగించారు. ఆర్జివి మీద నమ్మకం లేకున్నా హీరో నాగార్జునని చూసి తెలుగు రాష్ట్రాల్లో 3.50 కోట్లకు కొనేశారు డిస్ట్రిబ్యూటర్స్. వారికి ఈ సినిమా భారీ లాసులు తెచ్చిపెట్టింది.

Leave a comment