కాజ‌ల్‌కు పూజా హెగ్డే షాక్‌..!

98

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున ఈ వ‌య‌స్సులో కూడా వ‌రుస‌పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ప్ర‌స్తుతం రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌న్మ‌థుడు 2 సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే బంగార్రాజు సినిమాలో న‌టిస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ మూవీకి కల్యాణ్ కృష్ణ కుర‌సాల దర్శకుడు.

ఈ సినిమాలో నాగార్జున సరసన నాయికగా కాజల్‌ను తీసుకోవాలనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కాజ‌ల్ క‌న్నా చిత్ర‌యూనిట్ పూజాహెగ్డేపై ఇంట్ర‌స్ట్‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అందుకే కాజ‌ల్ ప్లేస్‌లో తాజాగా పూజా హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో ఇప్ప‌టికే చిత్ర యూనిట్ సంప్ర‌దింపులు జ‌ర‌ప‌గా ఓకే చెప్పిన‌ట్లు టాక్. పూజ‌కు ప్ర‌స్తుతం టాలీవుడ్ జ‌నాల్లో ఉన్న క్రేజ్ నేప‌థ్యంలోనే కాజ‌ల్‌ను ప‌క్క‌న పెట్టిన యూనిట్ ఆమెను తీసుకున్నార‌ట‌. అందుకే కాజ‌ల్ అవుట్ అయ్యింది.

పూజా ఇప్ప‌టికే నాగ్ త‌న‌యుడు నాగ‌చైత‌న్య స‌ర‌స‌న ఒక‌లైలాకోసం సినిమాలో రొమాన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. బంగార్రాజులో పూజా హీరోయిన్‌గా ఎంపికైతే కొడుకు హీరోయిన్‌తో ఇప్పుడు నాగార్జున రొమాన్స్‌కు రెడీ అవ్వాల్సిందే. ఈ సినిమాలో ‘బంగార్రాజు’ మనవడి పాత్రలో చైతూ కనిపించనున్నాడు. ఆయన జోడీగా ఎవరిని తీసుకుంటారో చూడాలి.

Leave a comment