Gossipsరకూల్ పై మన్మధుడి ఫైర్..?

రకూల్ పై మన్మధుడి ఫైర్..?

ఆరు పదుల వయస్సు దగ్గరపడుతున్నా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే వెండితెర మన్మథుడు నాగార్జున, ఇంకా యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గని స్థాయిలో తన నటన వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే నాగ్ కొడుకులు ఇద్దరూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చినా కొడుకులకు పోటీ ఇచ్చే స్థాయిలో సినిమాలు చేస్తూ డిఫ్రెంట్ డిఫ్రెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే భారీ హిట్ నమోదు చేసుకుని నాగ్ పేరే మార్చేసిన మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా మన్మథుడు 2 సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రంలో నాగార్జున పక్కన హాట్ బ్యూటీ రకూల్ ప్రీతీ సింగ్ జోడీ కడుతోంది. ఇప్పటికే తెలుగు ఇండ్రస్ట్రీ లో అందం, అభినయం ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్‌ సింగ్ లుక్‌పై నాగార్జున అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. రకూల్ అందం నాగ్ కి నచ్చలేదు అంటూ ట్రోల్స్ కూడా నడిచాయి. గతంలో బొద్దుగా చూడగానే ఆకట్టుకొనేలా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో మరీ సన్నబడటం మన్మథుడికి నచ్చలేదంట.

నా పక్కన ఇంత సన్నగా ఉంటే ఎలా ఉంటుందనే విషయాన్ని దర్శకుడు రాజారవీంద్రన్ తో చెప్పినట్టు ప్రచారం అవుతోంది. దీంతో సినిమాపై ఈ పుకార్ల ప్రభావం పడకుండా చూసేందుకు దర్శకుడు రంగంలోకి దిగాడు. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ విషయంపై రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్లో స్పందించారు. మా సినిమాకు సంబంధించిన వార్తలు వాస్తవానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ పోర్చుగీస్‌లో షూటింగ్ మాతో షూటింగ్‌లోనే ఉంది. ఆమె అందంగా, ముద్దుగా ఉండటం చూసి మేమంత హ్యాపీగా ఉన్నాం అని రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు. అంతే కాదు మా సినిమాకు అందం, అభినయం ఉన్న హీరోయిన్ దొరకడం మా అదృష్టం అంటూ రకూల్ ని పొగడ్తలతో ముంచెత్తాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news