Gossips''చిరు'' బయోపిక్ పై తమ్ముడి సంచలన వ్యాఖ్యలు !

”చిరు” బయోపిక్ పై తమ్ముడి సంచలన వ్యాఖ్యలు !

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. మహామహుల వారి వారి జీవితంలో ఎదుర్కొన్న కష్ట నష్టాలు సక్సెస్ లు గురించి ప్రేక్షకులకు తెలియజేసేందుకు ఈ బయోపిక్ లో దోహదపడుతున్నాయి. మహానటి టాలీవుడ్ లో మొదలైన ఈ ట్రెండ్ ఎన్టీఆర్ ‘కథానాయకుడు’, రాజశేఖర్ రెడ్డి ‘యాత్ర’, సంచలనాల దర్శకుడు ఆధ్వర్యంలో రాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఇలా ఒకదాని వెనుక మరొకటి వస్తూనే ఉన్నాయి.

తాజాగా… టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి బయోపిక్ పై తమ్ముడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బయోపిక్ అంటే… సక్సెస్ ఫుల్ వ్యక్తుల జీవితాలను తెరకెక్కించడం ఒక్కటే కాదని… వారి జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాలను కూడా ప్రేక్షకులకు చూపించాలని అభిప్రాయపడ్డాడు.

అయితే తన అన్న చిరు బయోపిక్ తీయాలని ఆలోచన గానీ… ఆసక్తి గానీ… తనకు గాని, రామ్ చరణ్ కు గాని లేదన్నారు. అలాగే చిరు కూడా తన బయోపిక్ తీయాలని ఎవరిని కోరలేదని, అసలు తనకు తాను.. గొప్పలు చెప్పుకునే వ్యక్తి చిరంజీవి కాదని నాగబాబు చెప్పారు.ఇకపతే… చిరు బయోపిక్ లో ఏ విధమైన కోణాలను బాగా హైలెట్ చేస్తారు…? ఎన్నికల ముందు ఇది తెరమీదకు వస్తుందా లేక ఆ తరువాత వస్తుందా అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే చిరు సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా రాణించినప్పటికీ… రాజకీయాల్లో ఫెయిల్ అవ్వడం… అప్పుడు కొంతమంది వ్యక్తులు చిరుని తప్పుదారి పట్టించడం, ఇవన్నీ ఈ బయోపిక్ లో ఉంటాయా లేదా అనేది తేలాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news