పెళ్లింట సురేశ్ బాబు స్టెప్పులు…

nagachaaithana samantha marriage

మ‌రికొద్ది గంట‌ల్లో నాగ్ చైత‌న్య స‌మంత మూడు ముళ్ల బంధంతో ఒక్క‌టి కానున్నారు. పెళ్లికి ముందు ఏర్పాటుచేసిన సంగీత్ కార్య‌క్ర‌మం అనేకానేక విశేషాల‌కు కేరాఫ్ గా నిలిచింది.అందాల భామ స‌మంత లెహంగాలో మెరిసిపోయింది.నాగచైతన్య మేనమామ దగ్గుబాటి సురేష్‌బాబు సమంత‌తో క‌లిసి డ్యాన్స్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

గోవాలో నిర్వహిస్తున్న ఈ పెళ్లికి గాయ‌ని చిన్మ‌యి దంప‌తులు అతిథులుగా హాజ‌రై ఫొటోల‌ను సామాజిక అనుసంధాన వేదిక ట్విట్ట‌ర్ లో పోస్టు చేశారు. పెళ్లి త‌రువాత హైద్రాబాద్‌లో రిసెప్ష‌న్ ఏర్పాటుచేయ‌నున్నారు.ఈ వేడుక‌కు తెలుగు, త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన పెద్ద‌లు త‌ర‌లిరానున్నారు.మ‌రోవైపు సామాజిక మాధ్య‌మాల్లో నాగ్ చైత‌న్య – స‌మంత జంట‌కు శుభాకాం క్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.

నాగ్, వెంకీ కూడా ఈ ఉద‌యం కొన్ని ఫొటోల‌ను ట్విట‌ర్లో పోస్ట్ చేసి త‌మ ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు.పెళ్లి త‌రువాత నాగ్ చైత‌న్య సవ్య‌సాచి షూటింగ్ లో బిజీ కానున్నాడు.స‌మంత కూడా త‌న కెరియ‌ర్‌ని కొన‌సాగించ‌నుంది.ఆమె న‌టించిన రాజు గారి గ‌ది 2 విడుద‌ల‌కు సిద్ధమైంది. అక్టోబ‌ర్ 13న ఇది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.మ‌నం త‌రువాత నాగ్ తో స‌మంత క‌లిసి న‌టించిన సినిమా ఇదే కావ‌డం విశేషం.

 

Leave a comment