కండోమ్ అడుగుతు దొరికిపోయిన నాగచైతన్య..!

132

అక్కినేని నాగ చైతన్య, సమంతలు జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా మజిలీ. ఈ సినిమా ట్రైలర్ ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. నిన్ను కోరి సినిమాతో సత్తా చాటిన శివ నిర్వాణ రెండో ప్రయత్నంగా మజిలీ సినిమా చేశాడు. ఈ సినిమ ట్రైలర్ చూసి అందరు షాక్ అవుతున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమై ఆ తర్వాత తనకు భార్యగా వచ్చిన అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు హీరో.

అయితే హీరో ప్రేమ కోసం హీరోయిన్ ఏం చేసింది అన్నది మజిలీ కథ. సినిమా ట్రైలర్ లో చైతు మెడికల్ షాప్ కు వెళ్లి కండొం అడగడం సర్ ప్రైజింగ్ గా ఉంది. చాక్లెట్ అడిగినట్టు అడుగుతున్నావే అంటూ మెడికల్ షాప్ యజమాని పోసాని అంటాడు. మొత్తానికి యూత్ ఆడియెన్స్ ను మెప్పించాలి అంటే విజయ్ దేవరకొండ లానే రఫ్ యాంగిల్ లో ట్రై చేయాలని చూస్తున్నారు యువ హీరోలు. వారిలో చైతు కూడా మజిలీలో క్రేజీ రోల్ చేస్తున్నాడు.

ఏప్రిల్ 5న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కచ్చితంగా అంచనాలను అందుకునేలా ఉంటుందని తెలుస్తుంది. సమనతో పాటుగా దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు తమన్ రీ రికార్డింగ్ అందిస్తున్నారు. ఉగాది రోజున తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మజిలీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment