చైతు, సమంత ” మజిలీ ” మూవీ టీజర్..!

30

నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తున్న సినిమా మజిలీ. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చైతు, సమంతలతో పాటుగా దివ్యాన్ష కౌషిక్ నటిస్తుంది. నిన్ను కోరి సినిమాతో సత్తా చాటిన శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న మరో ఎమోషనల్ మూవీ ఈ మజిలీ. ఆల్రెడీ లవ్ లో ఫెయిల్ అయ్యి జీవితంలో ఎటు వెళ్లాలో తెలియని టైంలో హీరో తండ్రి పెట్టిన సంవత్సరం గడువులో హీరో ఎలా మారాడు అన్నది సినిమా కథ.

చైతు క్రికెటర్ గా కనిపిస్తుండగా ఈ సినిమాలో సమంత అతని భార్యగా నటిస్తుంది. టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమా కూడా మరోసారి చైతు, సమంతల మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉంది. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

Leave a comment