ఎన్టీఆర్ పై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్… సినిమా ప్రమోషన్స్ కోసమా..?

19

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ గా నటించిన చిత్రం ” శైలజ రెడ్డి అల్లుడు “. ఈ చిత్రంలో చైతు తొలి సారిగా అను ఇమ్మాన్యుయేల్ తో నటించటం విశేషం. మరో ప్రముఖ నటి రమ్య కృష్ణ ఇందులో చైతు కి అత్తా పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య ఈ రోజు ట్విట్టర్ లో అభిమానులతో లైవ్ లో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా ట్వీట్ చేసారు చైతు.

ఇక అందులో భాగంగా ఒక అభిమాని ” ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏదని అడిగారు ”
అందుకు సమాధానంగా నాగ చైతన్య ” యమదొంగ ఇష్టం అని, ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలు చూస్తాను..ఒక నటుడిగా ఎన్టీఆర్ సెలెక్ట్ చేసుకునే పాత్రలు తనకి ఎంతో ఆదర్శమని, ఇంకా ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ సూపర్బ్.. అతను ఒక నిజమైన అల్ రౌండర్” అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చైతన్య ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ పై లేని అభిమానం సడన్ గా చైతు కి ఎందుకు కలిగిందో..సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని చైతు మచ్చిక చేసుకునే పనిలో ఉన్నాడని పలువురి వాదన.

Leave a comment