నాగ చైతన్య ని నిలదీసిన సమంత .. ఫోటో తో సహా పెట్టేసింది

samantha

అక్టోబర్ ఆరున మొగుడూ పెళ్ళాలుగా మారబోతున్న సమంత – నాగ చైతన్య లు తమ ప్రేమాను బంధాలను సోషల్ మీడియా తో అప్పుడప్పుడూ పంచుకొంటూ ఉంటారు. నాగ చైతన్య సమంత లాగా ఓపెన్ అవ్వకపోయినా సమంత మాత్రం తరచూ అతని గురించి పెడుతూ ఉంటుంది.

తాజాగా నాగచైతన్య గుండెలపై నిద్రిస్తున్న ఫోటోను ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్‌ చేసిన సమంత…తాజా సినిమా షూటింగ్‌ కి నెల రోజుల పాటు తమిళనాడులోని తెన్‌ కాశీకి వెళ్లాల్సి వస్తోందని తెలిపింది. ఇంత సుదీర్ఘమైన షెడ్యూల్‌ కోసం వెళ్లటానికి ముందు.. అసలు నేనెందుకు వెళ్లాలో మూడు కారణాలు చెప్పండి? అంటూ చైతన్యనో లేక ఆ సినిమా నిర్మాతనో కానీ ఆసక్తికర ప్రశ్నలు వేసి…చైకి దూరంగా వెళ్లడం ఇష్టం లేదని చెప్పకనే చెప్పింది. ఇంతకీ ఆమె వేసిన ప్రశ్నలు ఏంటంటే… 1) వర్షం పడే అవకాశముందని వాతావరణశాఖ చెబుతున్న వేళ షూటింగ్ జరుగుతుందా? 2) ఒక వేళ నేను అనారోగ్యానికి గురవుతానేమో? 3) అసలు నా విమానం టేకాఫ్‌ అవుతుందా? అని ప్రశ్నించింది. నాగ చైతన్య వెళ్లాల్సిందే అన్నట్టున్నాడు.

అందుకే…ప్లీజ్‌ నన్ను వెళ్లనివ్వొద్దు అంటూ వేడుకుంది. ఈ పోస్టు అందర్నీ ఆకట్టుకుంటోంది. వారి ప్రేమను తెలియజేస్తోందని, ఇద్దరూ గాఢమైన ప్రేమలో మునిగితేలుతున్నారని అభిమానులు పేర్కొంటున్నారు.

Leave a comment