Gossipsబాలయ్య దెబ్బకి సినీఇండస్ట్రీ నుండి నాగ బాబు అవుట్..

బాలయ్య దెబ్బకి సినీఇండస్ట్రీ నుండి నాగ బాబు అవుట్..

మెగా బ్రదర్ నాగబాబు నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదు అని చెప్పడం లేటెస్ట్ గా సిని, రాజకీయ వర్గాల్లో హాట్ న్యూస్ గా మారింది. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన మీద విమర్శలు చేస్తున్న బాలకృష్ణ మీద నాగ బాబు స్పందించి అసలు బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పడం ఆశ్చర్యంగా మారింది. కే.ఏ పాల్ లాంటి వారు బాలకృష్ణ ఎవరో తెలియదు అని చెప్పడం అంటే ఏదో ఆయన అలా అన్నాడని అనుకోవచ్చు కాని ఇండస్ట్రీలో ఉండే నాగబాబు బాలకృష్ణ ఎవరో తెలియదు అనడంపై నందమూరి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
1
కొన్నాళ్లుగా నడుస్తున్న నందమూరి, మెగా వార్ లోలోపలే ఉన్నా ఇప్పుడు బహిర్గతం అవుతుంది. పవన్ టిడిపిని టార్గెట్ చేస్తుంటే.. బాలకృష్ణ పవన్ ను టార్గెట్ చేశాడు.. అందుకే నాగబాబు బాలకృష్ణ మీద కామెంట్ చేశాడు. ఇలా చైన్ లింక్ ప్రాసెస్ జరుగుతుంది. అయితే నందమూరి ఫ్యాన్స్ ఈగో హర్ట్ అవడం వల్ల నాగబాబుని జబర్దస్త్ నుండి తీసేయాలని కోరుతున్నారట. అంతేకాదు ఇండస్ట్రీ నుండి నాగబాబుని బహిష్కరించాలని అంటున్నారు. వేరే కామెంట్ ఏదైనా చేస్తే ఓకే కాని అసలు ఎవరో తెలియదు అనడం గొడవకు దారి తీసింది.

మరి నందమూరి ఫ్యాన్స్ తాకిడికి నిజంగానే జబర్దస్త్ నుండి నాగబాబు క్విట్ అవుతాడా.. సినిమా పరిశ్రమ నుండి కూడా వార్నింగులు అందుకుంటాడా అన్నది చూడాలి. తెలంగాణా ఎన్నికల్లో టాలీవుడ్ లో అంత ప్రకంపణలు తీసుకురాలేదు. అయితే రాబోతున్న ఆంధ్రా ఎన్నికలు మాత్రం సిని పరిశ్రమలో వర్గాల పేరు జరిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి వీటి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news