నాగ్‌కు నిద్రలేకుండా చేస్తోంది ఎవరో తెలుసా..?

59

అక్కినేని నాగార్జున తన కొడుకులను హీరోలుగా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పటికే నాగ చైతన్య ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. అటు సమంత లాంటి స్టార్ హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్నాక మనోడు వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఇటీవల మజిలీతో సక్సెస్ కూడా అందుకున్నాడు. అయితే అందరూ మజిలీ సక్సె్స్‌ను ఎంజాయ్ చేస్తుంటే ఒక్క నాగ్ మాత్రం దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.

దీనికి కారణం ఆయన సుపుత్రుడే. నాగ్ రెండో కొడుకు అఖిల్‌ను అదిరిపోయే స్థాయిలో ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగ్, అతడి కెరీర్‌ను సక్సెస్ బాటలో వేయలేకపోతున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు చేసిన అఖిల్, ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేదు. దీంతో నాగ్‌కు అఖిల్ కెరీర్‌పై టెన్షన్‌గా ఉందని ఆయన సన్నిహితులు తెలిపారు. కాగా అఖిల్ ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నారు. ఇది కొంతమేర నాగ్‌కు ఊరట కలిగించే విషయమని చెప్పాలి. ఎందుకంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ ట్రాక్ రికార్డు అలాంటిది మరి. ఎలాంటి హీరోనైనా సక్సెస్ బాటలో వేయగల సత్తా ఈ బ్యానర్‌ది.

గతంలోనూ చైతూ ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు 100% లవ్ సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను గీతా ఆర్ట్స్ అందించింది. ఇప్పుడు అఖిల్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందని నాగ్ ఆశిస్తున్నాడు. మరి ఇప్పటికైనా నాగ్ కంటినిండా నిద్ర పోతాడో లేదో చూడాలి.

Leave a comment