కంపెనీ లో వర్మ – నాగ్ ముహూర్తం

nag varma

రాంగోపాల్ వర్మ ఏది చేసినా దాంట్లో ఏదో ఒక క్రియేటివిటీ ఉంటుంది. తాజాగా ఆయన అక్కినేని నాగార్జున తో చేస్తున్న సినిమాకు సంబంధించి ఒక ఫోటోను సోషల్ మీడియాలో విడుదల చేసాడు. ఇప్పుడు ఆ ఫోటో వెనుక ఉన్న పరమార్ధం ఏంటో తెలియక సినిమా అభిమానులు తలా పీక్కుంటున్నారు. వర్మ ఎప్పుడూ ఇంతే ఏదీ తిన్నగా చెప్పాడు కదా అనుకుంటూ ఆ ఫోటో గురించి ఆలోచనలో పడిపోయారు.

చాలా సంవత్సరాల తరువాత వర్మ, అక్కినేని నాగార్జున మరో చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్న సంగతి తెలిసిందే. ఆర్‌-కంపెనీ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రించనున్నారు. ఈ నేపథ్యంలో ఓ టేబుల్‌పై టీ గ్లాసు, గన్‌, పోలీసు టోపీ, కళ్లజోడుతో ఉన్న ఓ కాన్సెప్ట్‌ ఫొటోను వర్మ అభిమానులతో పంచుకున్నారు. కాప్‌డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వర్మ, సుధీర్‌చంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తొలి చిత్రం ‘శివ’ ప్రారంభోత్సవానికి తన తండ్రి, అక్కినేని నాగేశ్వరరావు హాజరయ్యారని.. ఇప్పుడు తన తల్లి, అక్కినేని వెంకట్‌, యార్లగడ్డ సురేంద్ర అతిథులుగా హాజరవుతారని రాంగోపాల్‌వర్మ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. 3 దశాబ్దాలకొకసారి తానుకూడా సెంటిమెంట్‌ ఫీలవుతానంటూ వర్మ చెప్పుకొస్తున్నారు.

Leave a comment