నా పేరు సూర్య.. కొనేవాడే లేడయ్యా..!

naa-peru-surya

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రచయితగా సూపర్ హిట్ సినిమాలను అందించిన వక్కతం వంశీ మెగాఫోన్ పట్టుకున్న సినిమా నా పేరు సూర్య. బన్ని యాంగ్రీ సోల్జర్ గా కనిపిస్తున్న ఈ సినిమా మే 4న రిలీజ్ అవుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ భారీగానే చేస్తున్నా ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకు అంత డిమాండ్ ఏర్పడలేదని తెలుస్తుంది.

ఓవర్సీస్ రైట్స్ 10 కోట్లు చెప్పడంతో అక్కడ డిస్ట్రిబ్యూటర్లు వెనుకడుగు వేస్తున్నారు. అయితే ఫైనల్ గా నిర్మాతలే అక్కడ రిలీజ్ చేద్దామని నిర్ణయించుకోగా ఓ డిస్ట్రిబ్యూటర్ కమీషన్ బేస్ తో 4 కోట్లు అడ్వాన్స్ కట్టి నా పేరు సూర్య కొనేశాడట. స్టార్ సినిమాలు ఓవర్సీస్ లో భారీగా మొత్తానికి కొనడం లాసులు ఫేస్ చేయడం చూస్తున్నారు.

అందుకే నా పేరు సూర్య సినిమాకు ముందు నుండే జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే వరుస సక్సెస్ లను అందుకుంటున్న బన్ని లాంటి హీరో సినిమాకే ఇలాంటి పరిస్థితి ఉంటే స్టార్ ఇమేజ్ ఉన్న ఫ్లాపులు అందుకుంటున్న హీరోల సినిమాలు ఓవర్సీస్ లో కష్టమే అని చెప్పాలి. మరి ఫైనల్ గా నా పేరు సూర్య ఫలితం ఎలా ఉండబోతుందో.. ఓవర్సీస్ లో ఈ సినిమా నిలబడగలుగుతుందో లేదో చూడాలి.

Leave a comment