ఆ ఇంటర్వెల్ .. బాక్సులు బద్ధలవ్వాల్సిందే..!

naa-peru-surya-movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న మూవీ నా పేరు సూర్య. యాంగ్రీ సోల్జర్ గా బన్ని తన లుక్స్ తో సర్ ప్రైజ్ చేశాడు. ఇక సినిమా నుండి వచ్చిన ఫస్ట్ ఇంపాక్ట్ అంచనాలను భారీగా పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ఇంటర్వల్ ఫైట్ సీన్ గురించి ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

సినిమాకు హైలెట్ గా చెప్పుకునే వాటిలో ఈ ఫైట్ సీన్ ఒకటట. టెన్నెల్ ఫైట్ తో బన్ని బాక్సాఫీస్ బద్ధలు కొడతాడని అంటున్నారు. సినిమాలో ఈ ఫైట్ మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుందని అంటున్నారు. సరైనోడు, డిజే సినిమాల తర్వాత బన్ని చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ వేయడం జరిగిందట. మే 4న సినిమా రిలీజ్ అవుతుండగా సినిమాపై అంచనాలు పెంచేలా వస్తున్న ఈ లీకులు బిజినెస్ భారీగా చేసేలా ప్రభావితం చూపిస్తున్నాయి.

Leave a comment