Gossipsరెస్పాన్స్ అదిరింది కానీ.. ప్రొడ్యూసర్ పరిస్థితేంటి..?

రెస్పాన్స్ అదిరింది కానీ.. ప్రొడ్యూసర్ పరిస్థితేంటి..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటుగా ఇంపాక్ట్ అంటూ టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. న్యూ ఇయర్ కు దుమ్మురేపేలా వచ్చిన అల్లు అర్జున్ టీజర్ తో మరోసారి తన సత్తా ఏంటో చాటాడు. టీజర్ రిలీజ్ అయిన క్షణం నుండి ట్రెండింగ్ లో ఉన్న నా పేరు సూర్య హంగామాతో నిర్మాత లగడపాటి శ్రీధర్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

ఇక సినిమా టీజర్ మాత్రమే కాదు సినిమా మొత్తం ఇదే రేంజ్ లో ఉంటుందని అంచనాలు పెంచారు. బన్ని డెడికేషన్, వక్కంతం వంశీ టేకింగ్ సినిమాకు హైలెట్ అని అన్నారు. ఇక సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ అవుతుందని రిలీజ్ క్లియరెన్స్ కూడా ఇచ్చేశారు. ఫస్ట్ ఇంపాక్ట్ లో డైలాగ్స్ కూడా బాగున్నాయని మాట్లాడుకోవడం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

ఇక సినిమా సమర్పకులు నాగబాబు కూడా ఇది కచ్చితంగా బన్ని కెరియర్ లో స్పెషల్ మూవీగా ఉంటుందని.. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా బన్ని కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా కథ కథనాలన్ని పర్ఫీక్ట్ ప్యాకేజ్ గా వస్తున్నాయని అన్నారు. ఇక మెగా అభిమానులకు ఇది సమ్మర్ స్పెషల్ గిఫ్ట్ అవుతుందని అన్నారు నాగబాబు. నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ డబుల్ బొనాంజా ఇచ్చిందని.. సినిమా ఏప్రిల్ 27న వచ్చి సూపర్ హిట్ కొడుతుందని సహ నిర్మాత బన్ని వాసు ఆనందం తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news