Videosనా నువ్వే వీడియో సాంగ్.. మిల్కీ అందాల మెరుపులతో..!

నా నువ్వే వీడియో సాంగ్.. మిల్కీ అందాల మెరుపులతో..!

కళ్యాణ్ రాం, తమన్నా జంటగా నటిస్తున్న నా నువ్వే సినిమాలో నిజమా మనసా సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో తమన్నా అందాల మీదే స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. కళ్యాణ్ రాం, తమన్నా డ్యుయెట్ గా వచ్చిన ఈ సాంగ్ లో అందరి చూపు తమన్నా హాట్ లుక్స్ మీదే ఉంది. హీరోయిన్ గా క్రేజీ లుక్స్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న తమన్నా ఈమధ్య తన హాట్ నెస్ పెంచిందని చెప్పొచ్చు.

ఇక ప్రస్తుతం కళ్యాణ్ రాం తో చేస్తున్న నా నువ్వేలో గ్లామర్ డోస్ మరింత పెంచిందని చెప్పాలి. నిజమా మనసా సాంగ్ లో అయితే తమన్నాని చూసేందుకు రెండు కళ్లు చాలవని చెప్పాలి. మే 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. జయేంద్ర డైరక్ష లో వస్తున్న ఈ సినిమాకు పిసి శ్రీరాం సినిమాటోగ్రఫీ హైలెట్ అవనుంది.

శరత్ మ్యూజిక్ అందిస్తున ఈ సినిమాకు మెలోడియస్ గా కూడా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. కళ్యాన్ రాం లవర్ బోయ్ గా చేంజ్ అయ్యి నటిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనంగా మారుతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news