నా.. నువ్వే పబ్లిక్ టాక్.. ఇదేం ట్విస్టండి బాబు..!

naa-nuve-public-talk

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా నా నువ్వే. జయేంద్ర డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించారు. ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా కథ, కథనాలు కళ్యాణ్ రామ్ ఇమేజ్ కు ఏమాత్రం సరితూగలేదని అంటున్నారు. సినిమా టాక్ అటు ఇటుగా ఉంది. ఈ కథకు కళ్యాణ్ రామ్ కాకుండా వేరే హీరో అయితే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.

పబ్లిక్ టాక్ చూస్తే కూడా అందరు కళ్యాణ్ రామ్ ఈ సినిమా చేయాల్సి ఉండకూదదని అంటున్నారు. తమన్నా వరకైతే మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. లవ్ స్టోరీ అంటే లీడ్ పెయిర్ కెమిస్ట్రీ చాలా అవసరం అలాంటిది ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, తమన్నాల జంట ఏమాత్రం ఆకట్టుకోలేదట. ఫీల్ గుడ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఏమి లేవని అంటున్నారు. ఇక చాలా సందర్భాల్లో లాజిక్ లేని విధంగా స్క్రీన్ ప్లే సాగుతుందట.

సినిమా ఎంచుకున్నందుకు కళ్యాణ్ రామ్ గట్స్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నా ఇది తనకు సూట్ అయ్యే సినిమా కాదని కొందరు అంటున్నారు. ఫైనల్ గా లవ్ స్టోరీగా వచ్చిన నా నువ్వే చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

Leave a comment