నా నువ్వే హిట్టా.. ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

naaa-nuvee-hit-or-flop

నందమూరి కళ్యాణ్ రామ్, తమన్నాలు జంటగా నటించిన సినిమా నా నువ్వే. జయేంద్ర డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పక్కా లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. కళ్యాణ్ రామ్ ఇమేజ్ కు దూరంగా ఈ సినిమా కథ, కథనాలు సాగాయి.

కళ్యాణ్ రామ్ ఇదో ప్రయోగంగా చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. సినిమా టాక్ మాత్రం బాగాలేదు. ఇక ప్లస్సుల విషయానికొస్తే.. ఇలాంటి కథను ఒప్పుకోవడం కళ్యాణ్ రామ్ గట్స్ కు మెచ్చుకోవాల్సిందే. మిల్కీ బ్యూటీ తమన్నా సినిమాకు ఆకర్షణగా నిలిచింది. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.

ఇక మైనస్సులైతే.. ఎక్కడా కథను కన్విన్స్ చేసే సీన్స్ లేకపోవడం.. లవ్ ట్రాక్ ఇంప్రెస్ చేయకపోవడం లాంటి వాటితో పాటుగా లీడ్ పెయిర్ కెమిస్ట్రీ అసలు ఏమాత్రం వర్క్ అవుట్ కాలేదని తెలుస్తుంది. కథనం సాగదీతగా ఉండటం కూడా పెద్ద మైనస్. మొత్తానికి కళ్యాణ్ రామ్ చేసిన ఈ కొత్త ప్రయత్నం ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పొచ్చు.

Leave a comment