నా నువ్వే 2డేస్ కలక్షన్స్.. డిజాస్టర్ కి అమ్మ మొగుడు..!

naa-nuvee-collections

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా జయేంద్ర డైరక్షన్ లో గురువారం రిలీజ్ అయిన సినిమా నా నువ్వే. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీగా వచ్చింది. సినిమా కళ్యాణ్ రామ్ ఇమేజ్ కు ఏమాత్రం సంబంధం లేకపోవడంతో ఫలితం తేడా కొట్టేసింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 89 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండవ రోజు కూడా కేవలం 50 లక్షలు వసూళ్లుగా రాబట్టింది.

ఈ లెక్కన చూస్తే కళ్యాణ్ రామ్ కెరియర్ లో నా నువ్వే భారీ డిజాస్టర్ అని చెప్పొచ్చు. యాడ్ ఫిల్మ్ మేకర్ అయిన జయేంద్ర డైరక్షన్ లో వచ్చిన నా నువ్వే ఆడియెన్స్ ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. కళ్యాణ్ రామ్ చేసిన ప్రయోగం సక్సెస్ కాలేదు. అతన్ని ఇంత సాఫ్ట్ క్యారక్టర్ లో అభిమానులు రిసీవ్ చేసుకోలేకపోయారు.

మిల్కీ అందాల మెరుపులు ఎన్నున్నా సినిమాలో కంటెంట్ దానికి తగిన ఎమోషన్ క్యారీ చేయడంలో విఫలమయ్యాడు దర్శకుడు జయేంద్ర అందుకే సినిమా ఇంత దారుణమైన ఫలితాన్ని అందుకుంది.

Leave a comment