నా లవ్ స్టోరీ ‘శ్రీమంతుడా’ సాంగ్.. రొమాన్స్ అదిరింది అబ్బ..!(వీడియో)

naa-love-story

మహీందర్ సోనాక్షి సింగ్ రావత్ లీడ్ రోల్స్ లో శివ గంగాధర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా లవ్ స్టోరీ. అశ్విని క్రియేషన్స్ బ్యానర్ లో జి. లక్ష్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు వేదనివాన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నుండి శ్రీమంతుడా సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ మధ్య రొమాన్స్ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు.

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న నా లవ్ స్టోరీ సాంగ్ ప్రోమోలతో ఆడియెన్స్ ను ఎట్రాక్ చేస్తుంది. ముఖ్యంగా శ్రీమంతుడా సాంగ్ హాట్ హాట్ గా అదరగొడుతుంది. చూస్తుంటే మారుతి ఈరోజుల్లో సినిమాలానే ఆడియెన్స్ ను థియేటర్లకు రప్పించడానికి దర్శకుడు బాగానే ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది.

కథ, కథనాలు నచ్చితే అది ఎంత చిన్న సినిమా అయినా ఆదరించేస్తారు ఆడియెన్స్. ఈ క్రమంలో నా లవ్ స్టోరీ సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను అలరిస్తుందని అంటున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. త్వరలో రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్స్ తో అదరగొడుతుంది.

Leave a comment