Gossipsనా పేరు సూర్య కూడా కాపీనా.. ఆ సినిమా డిటో దించేశారట..!

నా పేరు సూర్య కూడా కాపీనా.. ఆ సినిమా డిటో దించేశారట..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. ఈ సినిమా టీజర్ న్యూ ఇయర్ కానుకగా వచ్చి అంచనాలను పెంచేసింది. సినిమా టీజర్ లో బన్ని యాంగ్రీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు తన మీద తనకే కంట్రోల్ చేసుకోలేని కోపం కూడా అతని పాత్ర తీరుతెన్నులు చూస్తే అర్ధమవుతుంది.

ఇదంతా చూసిన తెలుగు ప్రేక్షకులు బన్ని నా పేరు సూర్య సినిమా రాజశేఖర్ ఆగ్రహం సినిమాకు కాపీ అంటూ హడావిడి చేయడం మొదలుపెట్టారు. నిజంగా ఆ సినిమాకు నా పేరు సూర్యకు సంబంధం ఉందో లేదో తెలియదు కాని రాజశేఖర్ ఆగ్రహం సినిమాకు డిటోనే నా పేరు సూర్య అన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న నా పేరు సూర్య సినిమాకు విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. నగా బాబు సమర్పణలో బన్ని వాసు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమ ఏప్రిల్ 27న రిలీజ్ అవుతుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news