Newsమహేష్ తో పదేళ్ల క్రితమే చేయాల్సిందట..!

మహేష్ తో పదేళ్ల క్రితమే చేయాల్సిందట..!

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. సెప్టెంబర్ 27న రిలీజ్ అవనున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. మహేష్ తో మురుగదాస్ ఊహలకే అందని ఈ క్రేజీ కాంబినేషన్ అసలైతే పదేళ్ల క్రితమే చేయాల్సి ఉందట కాని ఇన్నాళ్లకు అది కుదిరిందని అంటున్నాడు మురుగదాస్.

తెలుగు తమిళ భాషలు రెండు మాట్లాడే హీరోలు తెలుగులో తక్కువమందే ఉన్నారు. మహేష్ చిన్నతనం అంతా చెన్నైలోనే చేయడంతో తమిళం కూడా మాట్లాడగలడు. ఇక మహేష్ తొ దాదాపు దశాబ్ద కాలం నుండి సినిమా తీద్దామని అనుకుంటున్నా తనకు వీలు కుదరట్లేదని అన్నారు మురుగదాస్. స్పైడర్ సినిమా కచ్చితంగా ఫ్యాన్స్ కు నచ్చే సినిమా అవుతుందని అంటున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ బడ్జెట్ దాదాపు 130 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. మరి పదేళ్ల తర్వాత వచ్చిన అవకాశాన్ని మురుగదాస్ ఎలా వాడుకున్నాడో కాని సినిమా మీద తెలుగు ఆడియెన్స్ ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news