ఫ్యాన్స్ కి షాక్… అతితక్కువ బడ్జెట్ తో మల్టీస్టారర్

multistarer details

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలు గుర్తించేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా మెగా నందమూరి మల్టీస్టారర్. రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న ఈ సినిమా బడ్జెట్ కేవలం 40 కోట్లనే టాక్ వినిపిస్తుంది. అదేంటి ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు నటించే సినిమా కేవలం అంత తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయడం ఏంటంటే..

చరణ్, ఎన్.టి.ఆర్ ఇద్దరు 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలు. రాజమౌళి మాత్రం 40 కోట్లలో ఎలా ఫినిష్ చేస్తాడని అంటున్నాడు అంటే. కేవలం ప్రొడక్షన్ వాల్యూనే 40 కోట్లని తెలుస్తుంది. చరణ్, ఎన్.టి.ఆర్, రాజమౌళి వీళ్లెవరు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమాకు పనిచేస్తారట. సినిమా బిజినెస్ లో షేర్ తీసుకుంటారట. స్టార్ సినిమా అది మల్టీస్టారర్ అందునా రాజమౌళి డైరక్షన్.. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ బిజినెస్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే.

ఇన్ ఫ్యాక్ట్ రెమ్యునరేషన్ కన్నా లాభాల శాతమే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మొత్తానికి చరణ్, ఎన్.టి.ఆర్ సినిమా 40 కోట్ల బడ్జెట్ తో సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ ను ఫాలో అవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment