Gossips" Mr.కెకె " ట్రైలర్.. విక్రం యాక్షన్ ఎంటర్టైనర్..!

” Mr.కెకె ” ట్రైలర్.. విక్రం యాక్షన్ ఎంటర్టైనర్..!

చియాన్ విక్రం కు తెలుగులో అపరచితుడుతో సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ హీరోకి ఇక్కడ పెద్దగా విజయాలు రాలేదు. చేస్తున్న ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నా సరే పెద్దగా ప్రభావం లేదు. లేటెస్ట్ గా విక్రం నటిస్తున్న మిస్టర్ కేకేతో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు. రాజేష్ ఎం సెల్వం డైరక్షన్ లో కమల్ హాసన్ నిర్మిస్తున్న మిస్టర్ కేకే ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది.

విక్రం ఈసారి పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ చేసినట్టు తెలుస్తుంది. హాలీవుడ్ సినిమా తరహా మేకింగ్ సినిమాకు ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. విక్రం లుక్ కూడా అదిరిపోయింది. మిస్టర్ కేకే ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. విక్రం ఫ్యాన్స్ కు ఈ సినిమా పండుగ చేసుకునేలా చేస్తుందో లేదో చూడాలి. కొన్నాళ్లుగా తమిళంలో కూడా సరైన హిట్టు కొట్టని విక్రం మిస్టర్ కేకేతో సూపర్ హిట్ పై కన్నేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news