Gossipsకొత్త సినిమాల క‌లెక్షన్లు ఇవే...

కొత్త సినిమాల క‌లెక్షన్లు ఇవే…

చాలా కాలం తర్వాత తెలుగులో తమిళ డబ్బింగ్ సినిమాల డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో  శంకర్, మణిరత్నం లాంటి దర్శకుల హయాంలో ఇలాంటి ట్రెండ్ ఉండేది కాని తర్వాత అంత బలంగా ప్రభావం చూపించిన సినిమాలు ఈ మధ్య కాలంలో మాత్రం రాలేదు. మొన్న వచ్చిన నాలుగు సినిమాల్లో విజయ్ ట్రిపుల్ రోల్ చేసిన అదిరింది సినిమా పూర్తిగా డామినేట్ చేసేసింది. ఈ సినిమా ఈ వారాంతంలో ఒక్క రోజు ముందు  రిలీజ్ కావడం ప్లస్ పాయింట్  కాగా మిగిలిన సినిమాలు మాస్ కి నచ్చేవి కాకపోవడం మరోరకంగా కలిసివచ్చింది.

మొదటి రోజు యావరేజ్ ఓపెనింగ్ తెచ్చుకున్న అదిరింది క్రమక్రమంగా పికప్ కావడం కలెక్షన్ లో కనిపిస్తోంది. నాలుగు రోజులకు గాను దాదాపు 7 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్ లేట్ కావడం, తమిళ్ వెర్షన్ అప్పటికే చాలా మంది చూసేసి ఉండటం కొంత ప్రభావం చూపింది. అలాగే స్ట్రైట్ తెలుగు సినిమా ఒక్కడు మిగిలాడు దారుణమైన ఫలితాన్ని అందుకోగా ఈ సినిమా ఫైనల్ రన్ లోపు రెండు కోట్లు దాటడమే గగనం అంటున్నారు. ఇక విశాల్ నటించిన డ‌బ్బింగ్ మూవీ డిటెక్టివ్ టాక్ పాజిటివ్ గానే ఉన్నప్పటికీ వసూళ్లు మాత్రం అందుకు తగ్గట్టు లేవు. గ్రిప్పింగ్ గా ఉండే సీరియస్ డిటెక్టివ్ స్టొరీ కావడంతో మాస్ దూరంగా ఉన్నారు. అయితే డిటెక్టివ్ ఏ సెంట‌ర్లు, మ‌ల్టీఫ్లెక్స్ స్క్రీన్ల‌లో మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది.

ఇక సందీప్‌కిష‌న్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌టించిన ద్విభాషా చిత్రం కేరాఫ్ సూర్య ఒక వర్గాన్ని కొంతవరకు మెప్పిస్తుండగా ఈ రోజు నుంచి డ్రాప్ ఉండే అవకాశాలు ఉన్నాయి. గ‌త వారం రిలీజ్ అయిన రాజ‌శేఖ‌ర్ గరుడవేగ‌ మాత్రం స్టడీగానే ఉంది.యుఎస్ లో అర మిలియన్ మార్క్ కు చేరువలో ఉన్న ఈ మూవీ ఈ వీకెండ్ అయ్యే లోపు రాజు గారు గది 2, ఉన్నదీ ఒకటే జిందగీ, ఆనందో బ్రహ్మని ఈజీగా దాటేస్తుంది. ఇప్పుడు వచ్చే శుక్రవారం ఆరు సినిమాలు రాబోతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news