ఘోర రోడ్డు ప్రమాదంలో నరేష్ హీరోయిన్…పరిస్థితి విషమం?

allari naresh

తెలుగు, తమిళ, గుజరాతి సినిమాల్లో నటించిన హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఘోర రోడ్డు ప్రమాదం నుండి ప్రాణాలతో బయట పడ్డారు. ఉదయ్ పూర్ హైవే పై ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తుంది. ప్రమాదానికి గురైన కారుని చూస్తే అందులో ప్రయాణించే వారు ఒక్కరు బ్రతికి ఉండరని భావిస్తారు కాని అంత పెద్ద ప్రమాదం జరిగినా మోహాన్ గజ్జర్ అండ్ ఫ్యామిలీ చిన్న దెబ్బలతో బయట పడ్డారని తెలుస్తుంది.

మోహాన్ గజ్జర్ స్నేహితుడు రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా అహ్మదాబాద్ నుండి ఉదయ్ పూర్ వెళ్లగా.. అక్కడ నుండి రిటర్న్ అయిన మోహాన్ గజ్జర్ అండ్ ఫ్యామిలీ యాక్సిడెంట్ కు గురైంది. తెలుగులో సుడిగాలి సినిమాలో నటించింది మోహాన్ గజ్జర్. ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాలి సినిమాలో కూడా నరేష్ పక్కన నటించింది. ఈ యాక్సిడెంట్ ఆదివారం అవగా మోహాన్ గజ్జర్ చనిపోయినట్టు కొన్ని మీడియా ఛానెల్స్, యూట్యూబ్ ఛానెల్స్ ప్రకటించాయి.

అయితే అది నిజమే అనుకునే ఛాన్స్ ఉందని మోహాన్ గజ్జర్ ఈరోజు తన ట్విట్టర్ ద్వారా విషయాన్ని వెళ్లడించారు. మొత్తానికి కారు ప్రమాదం నుండి హీరోయిన్ సేఫ్ అయ్యింది. తెలుగుతో పాటుగా గుజరాతి సినిమాల్లో కూడా మోహాన్ గజ్జర్ నటించింది.

Leave a comment