Movies" మోహిని " రివ్యూ & రేటింగ్

” మోహిని ” రివ్యూ & రేటింగ్

సౌత్ లో క్రేజీ హీరోయిన్స్ లో ఒకరైన త్రిష 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూనే వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్స్ అందరితో నటించిన ఈ అమ్మడు లేటెస్ట్ గా మోహినిగా వచ్చింది. ఆర్. మదేష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఇండియాలో చెఫ్ గా పనిచేసే వైష్ణవి (త్రిష) తన స్నేహితురాలి బోయ్ ఫ్రెండ్ యొగిబాబుతో కలిసి లండన్ వెళ్తుంది. అయితే అక్కడకు వెళ్లాక వైష్ణవి ప్రవర్తనలో తేడా వస్తుంది. ఆమెకు తెలియకుండానే ఆమె ఎవరినో చంపాలని చూస్తుంది. అసలు వైష్ణవి ఎందుకు ఇలా చేస్తుంది అని తెలుసుకోగా ఆమె ఒంట్లో మోహిని ప్రవేశించిందని కనిపెడతారు. అసలు ఈ మోహిని ఎవరు..? వైష్ణవికి మోహినికి సంబంధం ఏంటి అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

సినిమాలో త్రిష రెండు పాత్రల్లో కనిపిస్తుంది. డ్యుయల్ రోల్ లో త్రిష మరోసారి తన ప్రతిభ కనబరచింది. ఇక సినిమాలో మేల్ లీడ్ గా నటించిన జాకీ భగ్నాని బాగానే చేశాడు. హీరో, హీరోయిన్ రొమాన్స్. త్రిష స్కిన్ షో సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. ముఖేష్ తివారి విలనిజం బాగుంది.

సాంకేతికవర్గం పనితీరు :

గురు దేవ్ సినిమాటోగ్రఫీ బాగుంది. హర్రర్ సినిమాలకు కావాల్సిన లైటింగ్, టేకింగ్ కెమెరా వర్క్ అద్భుతంగా అనిపిస్తుంది. వివేక్ మెర్విన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. థ్రిల్లర్ కథలకు కచ్చితంగా మ్యూజిక్ కుదరాలి ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మదేష్ సినిమా మొదటి భాగం సోసోగానే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కాస్త గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

విశ్లేషణ :

సీనియర్ హీరోయిన్స్ కమర్షియల్ సినిమాలు కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అనుష్క, నయనతార ఇప్పటికే అలాంటి సినిమలతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇక అదే దారిలో త్రిష మోహినిగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ అన్ని సినిమాల్లానే రివెంజ్ డ్రామాగా వచ్చింది.

కథ మాత్రమే కాదు కథనం కూడా అదే విధంగా రొటీన్ గా రాసుకున్నాడు దర్శకుడు ఆర్. మదేష్. అయితే టేకింగ్ లో అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయని అనిపిస్తుంది. సినిమాలో మరోసారి త్రిష ఫుల్ లెంగ్త్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఆమె ఫ్యాన్స్ కు అన్నివిధాలుగా నచ్చే అవకాశం ఉంది.

అయితే కథ, కథనాల్లో మాత్రం మోహిని నిరాశపరచింది. ఇలాంటి సినిమాలు ఇప్పటికే తెలుగులో చాలా వచ్చాయన్న భావన కలుగుతుంది. అక్కడక్కడ ల్యాగ్ అవడం కూడా జరిగింది. క్లైమాక్స్ కూడా అంత బాగా కుదరలేదు.

ప్లస్ పాయింట్స్ :

త్రిషా

థ్రిల్లింగ్ అంశాలు

కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్ :

స్టోరీ

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

రొటీన్ స్క్రీన్ ప్లే

బాటం లైన్ :

త్రిష మోహిని.. వృధా ప్రయత్నం..!

రేటింగ్ : 2/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news