Moviesమహేష్‌బాబు కళ్ళు బైర్లుకమ్మేలా షాకిచ్చిన మోహన్‌లాల్

మహేష్‌బాబు కళ్ళు బైర్లుకమ్మేలా షాకిచ్చిన మోహన్‌లాల్

Malayalam superstar Mohanlal shocks Prince Mahesh Babu with his latest film Manyam Puli. Recenly Mahesh watched special show of this movie and stunned by action episode which are done by Mohanlal at the age of 56.

ఒకరు టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ అయితే.. మరొకరు కేరళ ఇండస్ట్రీలో ఆ స్టార్‌డమ్‌ని అనుభవిస్తున్నాడు. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంగానీ, ఒకరి గురించి మరొకరు మాట్లాడడం గానీ ఎప్పుడూ జరగలేదు. అంతర్గతంగా ఒకరిపైమరొకరికి అభిమానం ఉండొచ్చుగానీ.. కెమెరాముందు అలాంటి అభిప్రాయాలు వెల్లడించిన సందర్భాలు లేవు. ఇక్కడ చెప్పదల్చుకున్నదేమిటంటే.. ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు.

అలాంటిది.. ఓ విషయంలో మహేష్‌బాబుకి మోహన్‌లాల్ షాకిచ్చాడు. ఇప్పటికీ ఆ షాక్‌లో నుంచి మహేష్ కోలుకోలేకపోతున్నాడట. ఇంతకీ ఏమైందని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే.. అసలు విషయం మీరు చదవాల్సిందే. మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన ‘పులిమురుగన్’ చిత్రం మలయాళంలో 125 కోట్లకు (గ్రాస్)పైగా భారీ వసూళ్లతో సంచలన విజయం సాధించడం వల్ల.. దాన్ని తెలుగులో ‘మన్యంపులి’గా సింధూరపువ్వు కృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ‘మనమంతా’, ‘జనతా గ్యారేజ్’లతో మోహన్‌లాల్ తెలుగు ఆడియెన్స్‌కి దగ్గరయ్యారు కాబట్టి.. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారనే ఉద్దేశంతో ఆయన డబ్ చేశారు.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ మూవీని రీసెంట్‌గా మహేష్‌బాబు చూశాడట. అతనికోసం కృష్ణారెడ్డి ఓ స్పెషల్ షో వేయగా.. దాన్ని తిలకించిన మహేష్ అందులోని యాక్షన్ సీక్వెన్స చూసి షాక్‌కి గురయ్యాడట. 56 ఏళ్ల వయసులోనూ మోహన్‌లాల్ ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్‌లో నటించడం విశేషమని, ఆ సన్నివేశాలన్నీ చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయని మెచ్చుకున్నాడట. దీంతో.. చిత్రబృందం చాలా సంతోషంగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news