మోహన్ బాబుకి మాతృ వియోగం.. అనారోగ్యంతో లక్ష్మమ్మ మృతి..!

Mohan babu's mother passes away

కలక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి.. మోహన్ బాబు తల్లి లక్ష్మమ్మ 85 గురువారం ఉదయం 6 గంటల ఉదయం తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మమ్మ ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ట్రీట్మెంట్ కు రెస్పాండ్ అవని ఆమె ఈరోజు ఉదయం అనంతలోకాలకు వెళ్లారు.

ప్రస్తుతం మంచు ఫ్యామిలీ ఫారిన్ ట్రిప్ లో ఉన్నారు. అయితే విషయం తెలియగానే వెంటనే తిరుపతి బయలుదేరారట. తిరుపతి శ్రీవిద్యా నికేతన్ లోనే లక్ష్మమ్మ మృతదేహాన్ని ఉంచారట. శుక్రవారం అంతిమ సంస్కారం చేస్తారని తెలుస్తుంది. ఈ సమయంలో మంచు మనోజ్ చేసిన ట్వీట్ అందరిని కదిలిస్తుంది. మా నానమ్మ దేవుడి దగ్గరకు వెళ్లిపోయారు. ప్రస్తుతం తాము ఈ దేశంలో లేము.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేశాడు మనోజ్.

Leave a comment