తేడా వస్తే రైళ్ళు తగలబెడతా – జలీల్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు

jaleel-khan-warning

విజయవాడ పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముస్లింలను విస్మరించినా, వారి మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా సహించేది లేదని అన్నారు. అంతే కాకుండా ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలో రైలును తగలబెడితే భయపడ్డారని, ముస్లింలకు ఏదైనా తేడా వస్తే వెనకా ముందూ ఆలోచించనని, ఎన్ని రైళ్లు తగలబడతాయో తెలియదని చంద్రబాబుతో స్వయంగా చెప్పానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమాత్రం తేడా వచ్చినా రివర్సు గేర్ వేస్తానని పార్టీలో చేరినప్పుడే తాను చంద్రబాబును హెచ్చరించానని ఆయన అన్నారు. అలాగే జగన్ ఒక ఫూల్ అని ఆయన విమర్శించారు. తాను అల్లాకు తప్ప ఎవరికీ భయపడనని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఫేక్ మీడియా అంటూ ధ్వజమెత్తిన ఆయన, తన వీడియోలో పంచ్ డైలాగ్స్ ను మాత్రమే ఎడిట్ చేసి వాడుకున్నారని… తన బీకాంలో ఫిజిక్స్ వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చారు.

Leave a comment