Moviesమొదటి వారాంతం లో మోత మోగించిన MLA .. కెరీర్ లోనే...

మొదటి వారాంతం లో మోత మోగించిన MLA .. కెరీర్ లోనే హైయెస్ట్ !!

గత శుక్రవారం రోజున ఎమ్మెల్యే గా మన ముందుకు వచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ కలెక్షన్ల మోత మోగించాడు.మూడు రోజులకి గాను తన కెరీర్ లోనే హైయెస్ట్ షేర్ కలెక్షన్లను వసూలు చేసి విజయం వైపుకు దూసుకు వెళ్తున్నాడు.పటాస్ తర్వాత గత కొన్నాళ్లుగా మంచి హిట్ లేని కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే తో హిట్ కొట్టాడు.

మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎమ్మెల్యే సినిమాలో కామెడీ అలాగే యాక్షన్ సన్నివేశాలు బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. సినిమాలో బ్రహ్మానందం , పోసాని , వెన్నెల కిషోర్ ల కామెడీ కళ్యాణ్ రామ్ కాజల్ ల జోడి బాగా కుదిరింది అంటున్నారు.ఇక అసలు విషయానికొస్తే ప్రపంచ వ్యాప్తంగా మొదటి మూడు రోజులకి గాని 14 కోట్ల గ్రాస్ 8 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news