కళ్లెదుటే ప్రేయసిపై అత్యాచారం.. ప్రియుడి ఆత్మహత్య!

3

రోజు రోజుకి మనుషుల్లో మానవత్వం మంటకలిసి పోతుంది. ఆడపిల్ల కనిపిస్తే చాలు మైనర్, మేజర్ అన్న తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఆడవారి రక్షణ కోసం కొత్త చట్టాలు ఎన్ని తెచ్చినా సరే ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. దేశంలో రోజుకి ఎక్కడో ఓ చోట ఏదో ఒక అమ్మాయి మృగం లాంటి మనుషుల వేటకు బలవుతుంది. లేటెస్ట్ గా స్నేహితుడితో కలిసి ఉన్న ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసిన సంఘటన సంచలనంగా మారింది.
3

4
ఉత్తరప్రదేశ్ లోని కటోఘోరా పోలీస్ స్టేషన్ పరిధిలో 21 ఏళ్ల సాయి తన ప్రేయసి అత్యాచారాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి ఓ మైనర్ బాలికను ప్రేమించాడు. ఆమెతో ఉన్న సమయంలో అక్కడకు వచ్చిన ఈశ్వర్ దాస్ (22), ఖేం కన్వర్ (21)సాయిని కొట్టి ఆ బాలిక మీద అత్యాచారం చేశారు. కళ్ల ఎదుటే ప్రేయసి అత్యాచారం చూసిన సాయి ఆత్మహత్య చేసుకున్నాడు.
2
అతని ఆత్మహత్యకు సంబందించిన విచారణ చేపట్టిన పోలీసులు ఈ విషయన్న్ని తెలుసుకున్నారు. ప్రస్తుతం నింధితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారట. ఆరోపణలు నిజమని తేలితే వీరిద్దరికి కఠిన శిక్ష పడె అవకాశం ఉందని అంటున్నారు.
1

Leave a comment