Gossipsమహా 'మెగా' ఫైట్.. అలవాటుపడక తప్పదా..!

మహా ‘మెగా’ ఫైట్.. అలవాటుపడక తప్పదా..!

టాలీవుడ్ లో క్రేజీ ఫాలోవర్స్ ను స్టార్స్ ఎవరంటే మెగా ఫ్యామిలీ హీరోలే అని చెప్పాలి. ఒకరా ఇద్దరా మెగాస్టార్ వేసిన బాటలో మెగా హీరోలంతా నడుస్తూనే ఉన్నారు. యువ హీరోల నుండి స్టార్స్ దాకా అక్కడ ఫాలోయింగ్ బాగా ఉంటుంది. ప్రస్తుతం సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ యువ హీరోలుగా ఉండగా.. అల్లు అర్జున్, చరణ్ స్టార్స్ గా హిట్ ట్రాక్ లో ఉన్నారు.

ఇక చిరంజీవి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గురించి చెప్పల్సిన పనిలేదు. అల్లు శిరీష్ కూడా తన సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం 7గురు హీరోలున్న ఈ ఫ్యామిలీ నుండి సాయి ధరం తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్.. ఇంకా చిరంజీవి చిన్నళ్లుడు కళ్యాణ్ హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో మెగా హీరోల సినిమాలే మెగా హీరోలకు పోటీ అవనున్నాయి.

ప్రస్తుతం వరుణ్ తేజ్ నటిస్తున్న తొలిప్రేమ, సాయి ధరం తేజ్ నటిస్తున్న ఇంటిలిజెంట్ ఈ రెండు ఫిబ్రవరి 9నే రిలీజ్ అవుతున్నాయి. ఇద్దరు హీరోలు ఈ పోటీని స్పోర్టివ్ గా తీసుకుంటున్నారు. అయితే ఇది మొదటిసారి మాత్రమే అనుకుంటే పొరపాటే ఇక నుండి 9 హీరోలు ఉన్న మెగా ఫ్యామిలీ నుండి ఏ ఇద్దరు హీరోలు సినిమాలైనా పోటీ పడతాయని అంటున్నారు. రాబోతున్న ఈ మెగా ఫైట్ కు అభిమానులు కూడా అలవాటు పడాలని సంకేతాలిస్తున్నారు.

http://www.telugulives.com/telugu/bagmati-review-and-rating/

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news