ఓ రోజు ముందే మెగా తనయుడికి మెగా గిఫ్ట్..!

ram-charan-mega-gift

మార్చి 27న మెగా పవర్ స్టార్ పుట్టినరోజు.. మెగాస్టార్ తనయుడిగా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్న చరణ్ ఈ బర్త్ డేకు రంగస్థలంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మార్చి 30న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక చరణ్ బర్త్ డే కారణంగా తనయుడికి ఓ రోజు ముందే మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.

ఇంతకీ మెగాస్టార్ చరణ్ కు ఏం గిఫ్ట్ ఇచ్చారు అంటే టైం లైన్ అని తెలుస్తుంది. వారు ముగ్గురు దిగిన పిక్ ను షేర్ చేస్తూ టైం లైన్ ఇచ్చిన అమ్మానాన్నలకు ధన్యవాదములు అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ రాం చరణ్. మెగాస్టార్ హ్యాష్ ట్యాగ్ కూడా తగిలించాడు. ఇక ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. మెగా ఫ్యాన్స్ కూడా చెర్రికి అడ్వాన్స్ బర్త్ డే విశెష్ అందిస్తున్నారు.

ఈ ఇయర్ చరణ్ బర్త్ డే మరింత ఉత్సాహంగా జరుపుకుంటాడని తెలుస్తుంది. ఎలాగు మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న రంగస్థలం హిట్ పక్కా అన్న టాక్ వచ్చింది. కాబట్టి ఇక చరణ్ రికార్డులు షురూ చేయడం ఖాయమని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చరణ్ బోయపాటి శ్రీను సినిమాలో నటిస్తున్నాడు. దాని తర్వాత రాజమౌళి సినిమాకు వర్క్ చేయాల్సి ఉంది.

Leave a comment