Gossipsమెగాస్టార్ లో మార్పుకి కారణం ఇదే..ఆ ఏజ్ లో.. అంత ...

మెగాస్టార్ లో మార్పుకి కారణం ఇదే..ఆ ఏజ్ లో.. అంత కష్టం .. హాట్స్ ఆఫ్ చిరు!

ఖైదీ నెంబర్ 150తో పదేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎన్నాళ్ల నుండో అనుకుంటున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. సైరా నరసింహారెడ్డి అంటూ గర్జిస్తున్న మెగాస్టార్ ఆ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.

ఇక సినిమా కోసం చిరంజీవి లావెక్కడం, సన్నబడటం చేస్తున్నాడు. ఈమధ్య సన్నబడిన చిరు మళ్లీ లావెక్కడం గమనిస్తున్నాం దానికి కారణం సైరా సినిమానే అని తెలుస్తుంది. ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తుండగా దానికోసం చిరు ఇలా మారిపోయారని తెలుస్తుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సైరా సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు.

అసలైతే మొదట 2019 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నారు కాని సమ్మర్ కు ఈ సినిమా వాయిదా పడ్డట్టు తెలుస్తుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ నటిస్తున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news