కళ్యాణ్ పై మెగా ఫ్యాన్స్ అసంతృప్తి..!

kalyan-and-mega-fans

ఇప్పటికే నాగబాబుతో సహా 8మంది హీరోలున్న మెగా కాంపౌండ్ నుండి మరో హీరో కళ్యాణ్ దేవ్ ఎంట్రీ షురూ అయ్యింది. మెగా అల్లుడుగా కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా రాకేష్ శషి డైరక్షన్ లో వస్తుంది. సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా విజేత అని పెట్టారు. అక్కడే మెగా వాడకం గురించి అందరు చర్చించుకునేలా ఛాన్స్ ఇచ్చారు.

మొదటి సినిమా అది కూడా టాలెంట్ చూపించాల్సిన సినిమా అలా కాకుండా మెగా ట్యాగ్ తో ఎవరొచ్చినా అభిమానులు ఆదరిస్తారనే నమ్మకమా అని ఫ్యాన్స్ లో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంటూ వచ్చిన అల్లు శిరీష్ కు ఇంకా ఓ ఇమేజ్ రాలేదు. ఈ క్రమంలో మళ్లీ కళ్యాణ్ దేవ్ ను మెగా హీరోగా ప్రమోట్ చేయడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు.

ఇంటి అల్లుడు కాబట్టి హీరో ఆశని కాదనకపోవడం వరకు బాగుంది. కాని ఇతన్ని కూడా మెగా హీరోగా ప్రమోట్ చేస్తూ మెగా టైటిల్ నే వాడేయడం ఫ్యాన్స్ నెగటివ్ గా ఆలోచిస్తున్నారు. మరి ఈ కళ్యాణ్ దేవ్ ఎలా వారి మనసులను గెలుస్తాడో చూడాలి.

Leave a comment