Gossipsచరణ్ చేసిన పనికి ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్..!

చరణ్ చేసిన పనికి ఫైర్ అవుతున్న మెగా ఫ్యాన్స్..!

ధ్రువ, రంగస్థలం సక్సెస్ లతో మస్త్ జబర్దస్త్ జోష్ లో ఉన్న మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు టైటిల్ గా రాజసం, రాజవంశస్థుడు, హీరో, జగదేక వీరుడు లాంటి టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమా మొదలై చాలా రోజులవుతున్నా సినిమా నుండి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.
3
బోయపాటి డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిరంజీవి బర్త్ డే ఆగష్టు 22న వస్తుందని అనుకున్నారు.. కాని ఆరోజు సైరా టీజర్ వచ్చింది కాబట్టి కుదరలేదు. అయితే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ వస్తుందనుకుంటే అప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. జస్ట్ బాబాయ్ కు పారాగ్లిడింగ్ చేస్తూ సర్ ప్రైజ్ విషెస్ అందించాడు చరణ్.
2
రెండు మెగా బర్త్ డేలను వదిలేసిన చరణ్ వ్యవహారం పట్ల మెగా ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న బోయపాటి శ్రీను సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ లు నటిస్తున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ హీరో కం విలన్ వివేక్ ఓబేరాయ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని తెలిసిందే.
1

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news