ఆ కోపంతో బోయపాటిని టార్గెట్ చేసిన మెగా ఫ్యామిలీ

Mega family targets boyapati

భారీ యాక్షన్ చిత్రాలను నిర్మించి …. భారీ భారీ హిట్లు కొట్టిన దర్శకుడు బోయపాటి శ్రీను టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బాలయ్య డైరెక్టర్ గా ముద్రపడ్డ బోయపాటి బాలయ్యకు అనేక హిట్లు అందించి అమాంతం క్రేజ్ పెంచేశారు. దీంతో అగ్ర హీరోలంతా బోయపాటి డైరక్షన్ లో సినిమా చేసేందుకు క్యూ కట్టేశారు. ఆ కోవలోనే మెగా హీరో రామ్ చరణ్ కూడా… ‘వినయ విధేయ రామ’ సినిమా చేసాడు.

సంక్రాంతి పండుగ సందర్భంగా… విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొక్క బోర్లా పడడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఈ సినిమా కారణంగా… డిస్ట్రిబ్యూటర్లు సుమారు 30 కోట్ల వరకు నష్టపోయారు. డిస్ట్రిబ్యూటర్ల నష్టాలకు పరిహారం చెల్లించాలని హీరో రామ్ చరణ్, నిర్మాత దానయ్య నిర్ణయించారు. అయితే ఈ విషయంలో బోయపాటి తన రెమ్యూనరేషన్ నుంచి కొంత సొమ్ము వెనక్కి ఇచ్చేందుకు ససేమీరా అనడం చెర్రీకి కోపం తెప్పిచ్చినట్టు ఫిలిం నగర్ టాక్.

అందుకే …. ఇక నుంచి బోయపాటి డైరక్షన్ లో ‘మెగా’ సినిమాలు చేయకూడదు అని డిసైడ్ అయిపోయారట.అయితే… ఈ విషయం లో బోయపాటికి బాలయ్య నుంచి సపోర్ట్ లభించిందట. త్వరలోనే బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో సినిమా కూడా తెరకెక్కబోతోందట. మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా… నీకు నేనున్నానంటూ బాలయ్య బోయపాటికి భరోసా ఇచ్చాడట.

Leave a comment