Specials మోదీ నిర్ణయంపై విమర్శకులని ఏకిపడేసిన నాగబాబు..మరెన్నో సంచలన వ్యాఖ్యలు!!

మోదీ నిర్ణయంపై విమర్శకులని ఏకిపడేసిన నాగబాబు..మరెన్నో సంచలన వ్యాఖ్యలు!!

Mega Brother Naga Babu has given excellent reply to all of them who criticize Narendra Modi for banning 500 and 1000 notes. At the same time he gave some valuable information.

పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రశంసిస్తున్నా.. విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలైతే ఈ నిర్ణయం సరైంది కాదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. సాధారణ ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇలా తారాస్థాయిలో విమర్శలు వస్తుండడాన్ని చూసి భరించలేకపోయిన నాగబాబు.. విమర్శకుల్ని ఏకిపారేశారు. మోదీ నిర్ణయానికి మద్దతునిస్తూ.. దాన్ని వ్యతిరేకించిన వారిని కడిగేశారు. ఎప్పుడూ తన పని తాను చేసుకుంటూ సైలెంట్‌గా ఉండే ఆయన.. ఈసారి మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తూ అదరగొట్టేశారు.

కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఉందని చెప్పిన నాగబాబు.. మోదీ నిర్ణయం బ్రహ్మాండమని కొనియాడారు. తాను మోడీ ఫాలోయర్‌ని కాదని, సగటు పౌరుడిగా మోదీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని చెప్పిన ఆయన.. విమర్శలకు కౌంటర్ అటాక్ చేసేలా పదునైన వ్యాఖ్యలు ప్రయోగించారు. ఈ దేశానికి ప్రధాని మోదీ రూపంలో దమ్మున్న మగాడు వచ్చాడని అన్నారు. దేశానికి ప్రధానమంత్రులుగా వ్యవహరించిన వారిలో నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహరావు, వాజ్‌పేయ్ వంటివారు అభివృద్ధి కోసం కొంత ప్రయత్నాలు చేశారు కానీ.. మోదీలాగా ఎవరూ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదన్నారు. భావాప్రకటన స్వేచ్ఛ ఎక్కువైపోయిన దేశానికి ఓ నియంత పాలకుడిగా వస్తే బాగుండేదని, అయితే ఆ వ్యక్తి కొన్నాళ్ళ తర్వాత ప్రమాదకరంగా మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే కఠినమైన వ్యక్తి రావాలని కోరుకున్నానని, చిన్నపటి నుంచి తనకున్న ఈ ఫీలింగ్ దాదాపు 45 ఏళ్ల తర్వాత నిజమైందని అన్నారు.

ఇక విమర్శకులపై నాగబాబు విరుచుకుపడ్డారు. ‘నోట్ల రద్దుతో సామాన్యులు విపరీతమైన కష్టాలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. విశాఖపట్నాన్ని హూదూద్ తుపాను ఊపేసినప్పుడు.. చెన్నైలో భారీ వర్షాలు కురిసి నగమంతా జల దిగ్బంధనం అయినప్పుడు.. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నెల రోజులపాటు నానా పాట్లు పడ్డారు. అలాంటి సంఘటనలతో పోల్చుకుంటే.. రోజు అంత పెద్ద కష్టమైతే లేదుగా? వరుసగా రెండు రోజులపాటు బ్యాంకుల చుట్టూ తిరిగినా.. ఒక్క రూపాయి కూడా రావటం లేదన్న వాళ్లు ఒక్కరున్నారా చెప్పమనండి? డబ్బు ఆలస్యంగా అందుతున్న మాట వాస్తవమే. ఆ మాత్రం కష్టాన్ని కూడా భరించలేమా? దమ్మున్న వ్యక్తి ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు అతనికి మద్దతుగా నిలవాల్సిందిపోయి.. విమర్శలు చేయటం ఏమిటి?’ అని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో గతంలో ఇందిరాగాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’ గురించి గుర్తు చేసుకున్నారు. ‘ఆమె తీసుకున్న ఆ నిర్ణయంతో దేశంలో కొన్ని రోజులపాటు ఎవరూ నోరు విప్ప మాట్లాడలేకపోయారు.. అలాంటి పరిస్థితి ఈ రోజు లేదు కదా?’ అని ప్రశ్నించారు. తనకు 50 రోజులు టైమివ్వాలని.. తనకు అండగా నిలబడితే.. తానేం చేయాలో చేసి చూపిస్తానని.. మార్పు తెస్తానని కోరిన మోదీకి మనం ఆ మాత్రం టైమివ్వలేమా?’ అని నాగబాబు అన్నారు. అంతేకాదు.. ప్రతిఒక్కరిని ఆలోజింపచేసేలా మరెన్నో వ్యాఖ్యలు చేయడంతోపాటు ఆసక్తికరమైన విషయాల్ని కూడా వెల్లడించారు. ఆ వీడియో మీకోసం..

https://youtu.be/v6qzZcVECuM

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news