మెగా కాంపౌండ్ నుండి మరో హీరో.. ఖబడ్దార్ అనేస్తున్నాడు..!

mega kalyan new entry

మెగాస్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారి సంఖ్య మనకి తెలిసిందే. మెగాస్టార్ క్రేజ్ తోనే పవర్ స్టార్ నుండి నిన్న మొన్నటి వరుణ్ తేజ్ వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ఇక ఇప్పుడు మెగా కాంపౌండ్ నుండి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారట. అతనెవరో కాదు చిరు చిన్నకూతురు భర్త కళ్యాణ్ అని అంటున్నారు. రీసెంట్ గా కళ్యాణ్ హీరోగా వస్తున్నాడంటూ వార్తలు వస్తుండటంతో దానిపై కూపీ లాగగా అది నిజమే అని తెలుస్తుంది.

ఇప్పటికే వైజాగ్ సత్యానంద్ దగ్గర యాక్టింగ్ కోర్స్ కూడా తీసుకుంటున్నాడట కళ్యాణ్.. చిరు పర్యవేక్షణలోనే ఇదంతా జరుగుతుందని తెలుస్తుంది. మెగా కాంపౌండ్ నుండి రాబోతున్న కళ్యాణ్ ను మరో స్టార్ గా నిలబెట్టేందుకు చిరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. అంతేకాదు మొదటి సినిమాతోనే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఓ పక్కా కమర్షియల్ సినిమా చేయబోతున్నారట. మరి మెగా కాంపౌండ్ నుండి వస్తున్న ఈ కొత్త హీరో ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటాడో చూడాలి.

 

Leave a comment