Gossipsమళ్ళి హిట్ కొట్టబోతున నాని "MCA" టీజర్

మళ్ళి హిట్ కొట్టబోతున నాని “MCA” టీజర్

నాచురల్ స్టార్ నాని హీరోగా ఓ మై ఫ్రెండ్ వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎం.సి.ఏ. దిల్ రాజు బ్యానర్లో క్రేజీ మూవీగా నిర్మితమవుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అదికాక వరుస హిట్లతో మంచి జోరు మీద ఉన్న నాని ఎం.సి.ఏగా ఎలా ఉంటాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ అంచనాలను నిజం చేస్తూ ఎం.సి.ఏ టీజర్ తో సూపర్ హిట్ గ్యారెంటీ అనేలా వచ్చాడు నాని.

మేం మిడిల్ క్లాస్ అబ్బాయిలం అంటూ దేవి అదిరిపోయే బీట్.. సాయి పల్లవి అందం.. నాని నాచురల్ నటన.. టీజర్ చూసి సినిమా చూడాలి అనేలా చేశారు. టీజర్ ఇలా ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. నాని మార్కెట్ రేంజ్ తెలిసిన దిల్ రాజు నేను లోకల్ తర్వాత వెంటనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. టీజర్ సూపర్ హిట్.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే డిసెంబర్ 15 దాకా వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news