సినిమా బ్యాడ్ టాక్.. కాని కలక్షన్స్ హిట్..!

mca 6 days collection

నాచురల్ స్టార్ నాని మరోసార్ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాల హిట్లే కాదు నాని తన మార్కెట్ పరిధిని కూడా పెంచుకున్నాడని రీసెంట్ రిలీజ్ ఎం.సి.ఏ తో తెలుస్తుంది. మిగతా సినిమాల్లా కాకుండా నాని నటించిన ఎం.సి.ఏ సినిమా మొదటి షో నుండి డివైడ్ టాక్ వచ్చింది. అయినా సరే ప్రమోషన్స్ ఏమాత్రం ఆపలేదు. దాని ఫలితంగా నాని మరోసారి రికార్డ్ కలక్షన్స్ రాబడుతున్నాడు.

నాని ఎం.సి.ఏ సూపర్ హిట్ అని చెప్పేందుకు 6వ రోజు కలక్షన్స్ చూస్తే చాలని చెప్పొచ్చు. సినిమా రిలీజ్ అయిన 6వ రోజు 2.10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఎం.సి.ఏ సినిమా. ప్రీ రిలీజ్ బిజినెస్ గా 24 కోట్ల వరకు చేసిన నాని 6వ రోజు కలక్షన్స్ తో బ్రేక్ ఈవెంట్ కు చేరుకున్నాడు. ఇక ఎన్నిరోజులు ఆడితే అన్ని రోజులు డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలే అని చెప్పాలి.

శ్రీరాం వేణు డైరక్షన్ లో వచ్చిన ఎం.సి.ఏ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా భూమిక ప్రధాన పాత్రలో నటించింది. మరి బ్యాడ్ టాక్ వస్తేనే ఈ రేంజ్ కలక్షన్స్ రాబడుతుంటే నాని సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం అతని సినిమా కలక్షన్స్ ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు.

ఇక ఆరు రోజుల నాని ఎం.సి.ఏ కలక్షన్స్ వివరాలు చూస్తే..

నైజాం – 10.07 కోట్లు, సీడెడ్ – 3.34 కోట్లు, ఉత్తరాంధ్ర – 3.01 కోట్లు, గుంటూరు – 1.67 కోట్లు, ఈస్ట్ గోదావరి – 1.65 కోట్లు, వెస్ట్ గోదావరి – 1.32 కోట్లు, కృష్ణా – 1.56 కోట్లు, నెల్లూరు – 0.70 కోట్లు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం 23.32 కోట్లు వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో కలుపుకుంటే నాని ఎం.సి.ఏ సూపర్ హిట్ అన్నట్టే.

Leave a comment