ప్రపంచ రికార్డ్ స్థాయిలో సాహో సాటిలైట్ రైట్స్..

5

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2019 ఆగష్టు 15న రిలీజ్ అంటున్నారు.

ఇక ఈ సినిమాకు సంబందించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ అన్ని జీ నెట్ వర్క్ సొంతం చేసుకుందట. అత్యధికంగా 70 కోట్లకు ఈ రైట్స్ సొంతం చేసుకుందట. చూస్తుంటే ఈ సినిమా సగం బడ్జెట్ ఈ రైట్స్ తోనే వచ్చేసినట్టు ఉంది. ఈమధ్యనే వదిలిన మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేసింది. బాహుబలి తర్వాత నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఆ రేంజ్ కు తగినట్టుగా ఈ సినిమా వస్తుంది.

శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ, హింది భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ అవనుంది. మరి ప్రభాస్ సాహో హంగామా ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే దాకా వెయిట్ చేయాల్సిందే.

Leave a comment