Gossipsనాగ్ సినిమాతో లాభపడిన రవితేజ...!

నాగ్ సినిమాతో లాభపడిన రవితేజ…!

వ‌రుస ఐదు సినిమాలు స‌క్సెస్ తో దిల్ రాజు య‌మా ఖుషీగా ఉన్నాడు. మాస్ ఎంట‌ర్ టైన‌ర్లు బాగా తెర‌కెక్కిస్తాడ‌న్న పేరుని డైరెక్ట‌ర్ అనీల్ నిల బెట్టుకున్నాడు.దీంతో పాటు క‌లెక్ష‌న్లు కూడా బాగానే ఉండ‌డంతో హీరో ర‌వితేజ ఆనందానికి అవ‌ధులే లేవు. దీపావ‌ళి కానుక‌గా విడుద‌లైన ఈ సినిమా ప్రారంభ వ‌సూళ్లు అదిరిపోయాయి. అంతేకాక గత వారం విడుదలైన ‘రాజుగారి గది – 2’ వసూళ్లు పూర్తిగా మందగించడం ఈ చిత్రానికి బాగా క‌లిసొచ్చిన అంశం.

వీకెండ్‌ వరకు రాజా ది గ్రేట్‌ వసూళ్లకి ఢోకా ఉండ‌ద‌న్న‌ది సినీవ‌ర్గాల అంచనా.! అటుపై ఈ సినిమా క‌లెక్ష‌న్ మందగిస్తుందా లేక ఇంకొంచెం పుంజుకుంటుందా లేకా నిల‌క‌డ‌గా ఉంటుందా అన్న‌దే తెలాల్సిన విష‌యం. ఏదేమైనప్ప‌టికీ రాజుగారి గది – 2 చిత్రం మాత్రం వీకెండ్‌ సినిమా అనిపించుకుంది.

మొదటి మూడు రోజులు అదరగొట్టిన ఈ చిత్రం నాలుగో రోజుకే బాగా డ్రాప్‌ అయిపోయింది.తొలి వారంలో పదిహేను కోట్ల షేర్‌ రాబట్టిన రాజుగారి గది – 2, సెకండ్‌ వీకెండ్‌లో ఎంత క్యాష్‌ చేసుకుంటుందన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి పాతిక కోట్ల షేర్‌ వస్తే హిట్‌ అనవచ్చునన్న‌ది ట్రేడ్ వ‌ర్గాల మాట. మొత్తానికి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ రెండు సినిమాల‌లో ఏది ఎక్కువ రోజులు ఆడి ఎక్కువ క‌లెక్ష‌న్లు కొలగొట్ట‌నుందీ అన్న‌దే ఇప్పుడు ఆస‌క్తిదాయ‌కం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news