Moviesరాజా అప్పుడే మిలియన్ కొట్టేశాడు... రవి తేజ మాస్ పవర్

రాజా అప్పుడే మిలియన్ కొట్టేశాడు… రవి తేజ మాస్ పవర్

మాస్ మహారాజ సినిమాలు వచ్చి దాదాపుగా సంవత్సరన్నర దాటింది. బెంగాల్ టైగర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రవితేజ ఈ సంవత్సరం రెండు సినిమాలతో మనముందుకు రానున్నాడు. ఒకటి ‘రాజా ది గ్రేట్’సినిమా కాగా మరొకటి ‘టచ్ చేసి చూడు’ . ఈ మధ్య తమ్ముడి మరణం ,డ్రగ్స్ కేసులతో డీలా పడ్డ తన ఫ్యాన్స్ కి ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాంచి ట్రీట్ ఇచ్చాడు మన రవితేజ. ఉదయం 9 గంటలకు రాజా ది గ్రేట్ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. గుడ్డివాడిగా నటిస్తున్న రవి తేజ అభినయం.. తన ఎనర్జీ లెవెల్స్ ని మరోసారి నిరూపించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ దాటిన ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news