హత్య వెనుక షాకింగ్ నిజాలు బయటపెట్టిన మారుతీ..!

11

మిర్యాలగూడలో పరువు హత్య సంచలనంగా మారింది. తన కూతురు ప్రేమించి పెళ్లాడిన ప్రణయ్ ను సుఫారిలు ఇచ్చి చంపించాడు మారుతి రావు. 10 లక్షల సుఫారి ఇచ్చి మూడు నెలల కిందటే రెక్కీ నిర్వహిస్తున్నారని తెలిసింది. కూతురు కన్నా తనకు తన పరువే ముఖ్యమని అందుకే ప్రణయ్ ను చంపించానని అంటున్నాడు మారుతి రావు.

అంతేకాదు జైలుకి వెళ్లేందుకు సిద్ధపడే ఈ హత్య చేయించానని నేరం ఒప్పుకున్న అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మారుతి రావుతో పాటుగా అతని తమ్ముడు శ్రవణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 9వ తరగతి నుండి ప్రేమించుకుంటున్న ప్రణయ్, అమృతలకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాడట మారుతి రావు.

కూతురి మీద ప్రేమతోనే ప్రణయ్ ను హత్య చేయించానని చెబుతున్నాడు మారుతి రావు. 10 లక్షల సుఫారి ఇచ్చి మరి ప్రణయ్ కు పక్కా ప్లానింగ్ తో హత్య చేయించడం జరిగింది. కూతురు తల్లి అవుతుందని తెలిసి కూడా మారుతి రావు ఇంత దారుణం చేయిస్తాడని ఎవరు ఊహించలేదు.

ప్రణయ్ చనిపోతే తాను పుట్టింటికి వెళ్తానని భావించారేమో.. కడుపులో పెరుగుతున్న బిడ్డని ప్రణయ్ గుర్తుగా పెంచుకుంటానని.. శిక్ష పడే వరకు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటుంది అమృత. పరువు హత్యలు ఇంతటితో ముగియాలని తాను దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటుంది అమృత.
2

Leave a comment