Gossips" మంజూర్ ఏ ఖుదా " వీడియో సాంగ్..?

” మంజూర్ ఏ ఖుదా ” వీడియో సాంగ్..?

అమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ” థగ్స్ అఫ్ హిందుస్థాన్ ” ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 8 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించగా అజయ్, అతుల్ స్వరాలు అందించారు. ఇప్పటికే విడుదల చేసిన చిత్ర ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావటంతో సినిమా పై అంచనాలు పెరిగాయి.

ఇక ఈ రోజు ఈ సినిమాలోని కత్రినా కైఫ్ నర్తించిన ” మంజూర్ ఏ ఖుదా ” సాంగ్ టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసారు. ఈ పాటలో కత్రినా మరోసారి తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది. కత్రినా చేసిన డ్యాన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు.అత్యంత క్లిష్టమైన స్టెప్స్ కూడా కత్రినా ఎంతో సులభంగా అందంగా చేయటంతో ఆమె డ్యాన్స్ కి అన్ని వర్గాల నుండి ప్రశంసలు రావటం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news