Movies'మను' రివ్యూ & రేటింగ్

‘మను’ రివ్యూ & రేటింగ్

బ్రహ్మానందం కొడుకు గౌతం హీరోగా యూట్యూబ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న చాందిని చౌదరి హీరోయిన్ గా వస్తున్న సినిమా మను. మధురం షార్ట్ మూవీతో క్రేజ్ తెచ్చుకున్న ఫణీంద్ర నరిశెట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి ఈసమీక్ష లో చూద్దాం.

కథ :

ఆల్రెడీ ప్రేమించుకున్న నీలా (చాందిని), మను (గౌతం)లు ఓ చిన్న గొడవ వల్ల దూరం అవుతారు. నీల ఫ్లాట్ లో రెంట్ గా ఉంటున్న ఒక డైమండ్ స్మగ్లర్ వల్ల వరుస హత్యలు జరుగుతుంటాయి. వాటిని కనిపెట్టేందుకు మను ప్రయత్నిస్తాడు. చివరకు అసలు ఈ మర్డర్ చేసేది ఎవరు..? ఎందుకు చేస్తున్నారు..? వాటికి మను, నీలాల లవ్ స్టోరీకి సంబంధం ఏంటి..? అన్నది సినిమా కథ.
3

నటీనటుల ప్రతిభ :

మనుగా గౌతం తన పాత్రకు తగినట్టు చేశాడు. చాందిని చౌదరి సినిమాకు హెల్ప్ అయ్యింది. మిగతా పాత్రలన్ని పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సినిమాలో నటీనటులంతా సహజ నటనతో ఆకట్టుకున్నారు. వారి నుండి సహజత్వాన్ని తీసుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

సాంకేతిక వర్గం పనితీరు :

విశ్వనాధ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. రకరకాల యాంగిల్స్ ట్రై చేయడం జరిగింది. కచ్చితంగా సినిమాలో అతనికి మంచి పేరు వస్తుంది. ఇక సాంగ్స్ ఏమి లేకుండా కేవలం బిజిఎం తోనే నడిపించడం ఓ సాహసమే అని చెప్పొచ్చు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆసక్తి కలిగించింది. అయితే దర్శకుడు ఫణీంద్ర కథ, కథనాలు ఆడియెన్స్ పేషెన్స్ ను టెస్ట్ చేసేలా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.
2

1

విశ్లేషణ :

షార్ట్ మూవీస్ చేసిన అనుభవంతో కొత్త కథను కొత్త కథనంతో చెప్పాలని చూడటం మంచి విషయమే. అయితే అది ఆడియెన్స్ ను మెప్పించేలా చేయాలి. మను విషయంలో అదే జరిగింది. సినిమా కథ, కథనం చాలా బాగున్నాయి. కాని మధ్యలో చాలా స్లో నరేషన్ సినిమా మీద బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా చేస్తుంది.

మొదట్లో కాస్త పర్వాలేదు అనిపించినా సినిమా రన్ టైం 3 గంటలు ఉండేసరికి ప్రేక్షకులు కచ్చితంగా బోర్ ఫీల్ అవుతారు. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది. గౌతం, చాందిని తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ కాస్త క్యూరియాసిటీగా నడిపించగా సెకండ్ హాఫ్ రొటీన్ గా అనిపిస్తుంది.

ప్రీ క్లైమాక్స్ మళ్లీ కాస్త సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తుంది. ఓవరాల్ గా ఇది ఓ మంచి ప్రయత్నం కాని ఆడియెన్స్ ను మెప్పించాలంటే కచ్చితంగా కొన్ని సీన్స్ ఉండాలి. అలాంటివి ఈ సినిమాలో లోపించాయని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

లీడ్ కాస్ట్ యాక్టింగ్

బిజిఎం

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

స్లో నరేషన్

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

బాటం లైన్ :

మను.. పేషెన్స్ టెస్ట్ చేస్తుంది..!

రేటింగ్ : 2.25/5

https://youtu.be/LxddNs19cfU

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news