Gossipsఎన్టీఆర్ కోసం ప్రాణం ఇస్తానంటున్న మంచు మనోజ్..!

ఎన్టీఆర్ కోసం ప్రాణం ఇస్తానంటున్న మంచు మనోజ్..!

తెలుగు హీరోలు ఈమధ్య కొన్ని విషయాల్లో తమకు అసలు ఈగో లేదని, రియల్ లైఫ్ లో తాము మంచి స్నేహితుల్లా ఉంటామని రుజువు చేస్తున్నారు. కానీ ఈమధ్య కాలంలో టాలీవుడ్ యంగ్ హీరోల మధ్య ఇగో సమస్యలు బాగా పెరిగి పోతున్న నేపధ్యంలో మంచు మనోజ్ ఇలాంటి ఇగోలు ఏమి పెట్టుకోకుండా జూనియర్ పై తనకు ఉన్న అభిమానాన్ని ఇలా వ్యక్త పరచడం ఒక మంచి పరిణామంగా కనిపిస్తోంది. హీరో మంచు మనోజ్, జూనియర్ ఎన్టీఆర్ చిన్ననాటి స్నేహితులన్న విషయం తెలిసిందే.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు మంచు ఫ్యామిలీ అక్కడ ఎవరూ కనిపించలేదు. అప్పుడు వారంతా విదేశాల్లో ఉండటమే కారణం. కానీ మనోజ్ మాత్రం ఆ విషయం తెలుసుకొని వెంటనే తన టూర్ టూర్ రద్దు చేసుకుని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేసాడు. అంతే కాదు అంతిమ యాత్రలో నడుచుకుంటూనే… ఎన్టీఆర్ కళ్యాణ్ వైపు ఎవరూ రాకుండా చూసుకున్నాడు. దీంతో అక్కడున్న మనోజ్ అంత సింపుల్ గా ఎలా ఉన్నాడు హీరో అన్న ఫీలింగ్ ఏమీ లేకుండా సాదాసీదాగా సెక్యూరిటీ గార్డ్ లా మారిపోయాడు అంటూ మెచ్చుకున్నారు.

తాజాగా ఎన్టీఆర్ మంచు మనోజ్ ని ఉద్దేశించి బయ్యా ..! నా గురించి ఒక్క మాట చెప్పు అంటూ ట్విట్ పెట్టాడు. ఎన్టీఆర్ ట్విట్ కి మనోజ్ ” నా ప్రాణం” అంటూ ట్విట్ చేసాడు. ఈ ఇద్దరి హీరోల ఫ్రెండ్ షిప్ మీద అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. మనోజ్ ట్విట్ కింద అభిమానులు కూడా ఎన్టీఆర్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా అదే రిపీట్ అవుతుంది అంటూ … ఇదేరా నిజమైన ఫ్రెండ్ షిప్ , నువ్వు మా ఫ్యాన్స్ ప్రాణం కూడా అంటూ ఎవరికీ వారు ఎన్టీఆర్ మీద ప్రేమ కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి హీరోల మధ్య ట్విట్స్ వారి అనుబంధాన్ని తెలియజేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news