‘మన్మథుడు 2’ డేట్ కన్ఫామ్..!

65

‘మన్మథుడు 2’డేట్ కన్ఫామ్
టాలీవుడ్ లో రొమాంటిక్ హీరోల్లో ఒకరు అక్కినేని నాగార్జున. ఆయన ఎన్నో ప్రేమ కథాచిత్రాల్లో నటించి మెప్పించారు. మజ్ను,గీతాంజలి అప్పట్లో ఓ నెస్సేషన్ అయితే..తర్వాత కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘మన్మథుడు’ మరో రేంజ్ హిట్ సాధించింది. ఈ మూవీలో మంచి ప్రేమికుడుగా నటించిన నాగ్ తర్వాత కోపిష్టిగా మారుతాడు. అమ్మాయిలంటే ద్వేషిస్తాడు..తర్వాత ఓ హీరోయిన్ ప్రేమలో ఎలా పడతావడు..ఎలా పెళ్లి చేసుకుంటాడు అనేది చిత్ర కథ.

ఈ సినిమా హిట్ తర్వాత సీక్వెల్ తీయాలని చూశారు. అది చాలాకాలం తర్వాత సెట్ అయ్యింది. రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో నాగార్జున, రకూల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ నటిస్తున్న ‘మన్మథుడు 2 ’ మూవీ షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

నాగార్జున సొంత బ్యానర్లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఒక కీలకమైన పాత్రను పోషించింది.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ఐశ్వర్య గౌడ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.

Leave a comment